ETV Bharat / bharat

161అడుగుల ఎత్తు, 5గోపురాలతో రామ మందిర నిర్మాణం

author img

By

Published : Jul 19, 2020, 1:59 PM IST

161అడుగుల ఎత్తు, 5గోపురాలతో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఖరారు చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థకేత్ర ట్రస్టు. మహంత్​ నృత్య గోపాల్​ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీకి ట్రస్టు సభ్యులందరూ హాజరయ్యారు.

Ram Mandir in Ayodhya to be 161-feet tall with 5 domes
రామ మందిరం

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో నిర్మించబోయే రామాలయం ఎత్తు 161 అడుగులు ఉండాలని నిర్ణయించింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. 5 గోపురాలు ఉండాలని ఖరారు చేసింది. ట్రస్టు అధ్యక్షుడు మహంత్​ నృత్యగోపాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్యులందరూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ట్రస్టు సభ్యులందరూ హాజరైన ఈ భేటీలో రామ మందిర నమూనా(డిజైన్​) గురించి కూడా చర్చించారు. ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ట్రస్టు తెలిపింది.

విశ్వహిందూ పరిషత్​ ప్రతిపాదన మేరకు రామ మందిర నమూనాను ఖరారు చేశారు. ఎత్తు, వెడల్పు మాత్రం పెంచారు. నిర్మాణ పనులు మూడున్నర ఏళ్ల పాటు జరగనున్నాయి. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ పనులు కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమయ్యాయి.

ఇదీ చూడండి: బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.