భారత తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్ 'గగన్‌యాన్' ఎంతో క్లిష్టమైందని అభిప్రాయపడ్డారు వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. అయితే 2022లోగా గగన్‌యాన్‌ను ప్రయోగించే సామర్థ్యం ఇస్రోకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. అవరోధాలను ఇస్రో అధిగమిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
"మనం ఏదైనా సాధించగలం. మనకి అవకాశాలు రాలేదు అంతే. సరైన మద్దతు లభించలేదు. అందుకే మన సామర్థ్యానికి తగిన గుర్తింపు దక్కలేదు."
--- రాకేశ్ శర్మ, వింగ్ కమాండర్.
అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించారు రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 2న సోవియెట్ యూనియన్‌కు చెందిన సుయాజ్ టీ-11తో అంతరిక్షంలోకి చేరుకున్నారు రాకేశ్. ప్రస్తుతం గగన్‌యాన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
గగన్‌యాన్‌లో ప్రయాణించే వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉండాలన్నారు రాకేశ్. ఇందుకు సంబంధించిన చర్యలు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపారు.
గగనయాన్ విజయవంతమైతే.. మనిషిని అంతరిక్ష్యంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించాయి. 2021 డిసెంబర్లో గగన్‌యాన్‌ను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది.
ఇదీ చూడండి:- 'గగన్‌యాన్‌లో మహిళలు ఉండకపోవచ్చు..!'