రుణాల ఎగవేత, దివాలా స్మృతి చట్టం సవరణకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూడేళ్ల నాటి ఈ బిల్లుకు ఎగువసభ ఆమోదం తెలిపింది. రుణ ఎగవేతదారులను దివాలా బిల్లు ఏరివేస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు.
రుణాలకు సంబంధించి దాతలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు ఈ బిల్లులో స్పష్టతనిచ్చారు. అప్పు ఎగవేతదారుల ఆస్తులను వేలం వేసేందుకు రుణదాతలకు అధికారం కల్పించారు. ఈ చట్టం అమలులో ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. దివాలా ప్రక్రియ పూర్తయ్యాక సంస్థకు పునర్వైభవం తీసుకొస్తామని చెప్పారు మంత్రి.
ఇదీ చూడండి: 'విపక్షాల గొంతు నొక్కేస్తున్నారనడం అవాస్తవం'