జమ్ముకశ్మీర్ కేరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కీలక ఫార్వర్డ్ పోస్ట్‌ను సందర్శించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణే సహా ఇతర సీనియర్ అధికారులతో కలిసి సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. సందర్శనకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు రాజ్‌నాథ్.
"ఫార్వర్డ్ పోస్ట్‌ను సందర్శించి.. అక్కడ ఉన్న జవాన్లతో మాట్లాడాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని కాపాడుతున్న సైనికుల వీరత్వానికి, ధైర్యం పట్ల ఎంతో గర్వంగా ఉంది."
-- రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి.
సైనిక శిబిరాన్ని సందర్శించే ముందు.. అమర్నాథ్ ఆలయనికి వెళ్లారు రాజ్‌నాథ్. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సైనిక బలగాలతో సమావేశమయ్యారు రక్షణ మంత్రి. సరిహద్దు భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు ధీటైనా జవాబు చెప్పాలని సూచించారు.
ఇదీ చూడండి:- పాక్ దుర్నీతికి ముగ్గురు భారతీయులు బలి