భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం రష్యా బయలుదేరనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా భారత్-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయిల్లో చర్చలు జరపనున్నారు.
అందుకే ప్రాధాన్యం..
ఎస్సీఓలో సభ్యదేశం కావడం వల్ల చైనా రక్షణ మంత్రి జెన్ ఉయ్ ఫెంఘీ కూడా ఈ భేటీకి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది జూన్‌లోనూ మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించారు రాజ్‌నాథ్. మాస్కోలో జరిగిన 75వ విక్టరీ డే పరేడ్‌లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'భారత జవాన్లే చైనా దళాలను రెచ్చగొట్టారు'