ETV Bharat / bharat

చైనాతో ప్రతిష్టంభనపై రాజ్యసభలో నేడు రాజ్​​నాథ్​ ప్రకటన - rajnath on china issue

లద్దాఖ్​లో భారత్​- చైనా సైనిక ప్రతిష్టంభనపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ గురువారం ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజ్​నాథ్​ మాట్లాడిన తర్వాత విపక్ష సభ్యులకు ఈ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనున్నారు.

RS RAJNATH CHINA
రాజ్​​నాథ్​
author img

By

Published : Sep 17, 2020, 5:06 AM IST

తూర్పు లద్దాఖ్​లో భారత్, చైనా సైన్యం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన అంశంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ గురువారం (ఇవాళ) రాజ్యసభ​లో ప్రకటన చేయనున్నారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితిపై ఎగువ సభకు పలు విషయాలు వివరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

రాజ్యసభ ఫ్లోర్​ లీడర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం.. సరిహద్దు అంశంపై మధ్యాహ్నం 12 గంటలకు రాజ్​నాథ్​ ప్రకటన చేయనున్నారు. అనంతరం విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎంపీల లేవనెత్తే అంశాలపైనా రాజ్​నాథ్​ వివరణ ఇస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

లోక్​సభలో..

ఇప్పటికే ఈ అంశంపై లోక్​సభలో మంగళవారం ప్రకటన చేశారు రాజ్​నాథ్​. రెండు దేశాల మధ్య ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: చైనా కుట్రలను దీటుగా తిప్పికొడతాం: రాజ్​నాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.