ETV Bharat / bharat

రాజ్​నాథ్ కశ్మీర్​ పర్యటన.. సైనిక సన్నద్ధతపై సమీక్ష - rajnath singh going to kashmir on friday and to be conduct review on border situation

సరిహద్దు ఘర్షణల అనంతరం రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ తొలిసారి కశ్మీర్​ను సందర్శించనున్నారు. రక్షణమంత్రితో పాటు సైన్యాధిపతి నరవాణే, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేశ్​కుమార్ సింగ్ లేహ్ పర్యటనలో పాల్గొననున్నారు. సైనిక సన్నద్ధతపై సమీక్షించనున్నారు.

rajnath
రాజ్​నాథ్​
author img

By

Published : Jul 16, 2020, 7:00 AM IST

Updated : Jul 16, 2020, 7:14 AM IST

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. సరిహద్దులో మోహరించిన సైనికులతో సంభాషించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించనున్నారు. రక్షణమంత్రితో పాటు సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవాణే, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్ యోగేశ్‌ కుమార్ సింగ్‌ సైతం రక్షణమంత్రి లేహ్ పర్యటనలో పాల్గొననున్నారు.

వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక సన్నద్ధతను రాజ్‌నాథ్ పరిశీలించనున్నారు. శుక్రవారం దిల్లీ నుంచి నేరుగా లేహ్‌కు బయలుదేరనున్న రాజ్‌నాథ్ గల్వాన్ ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శిస్తారు. భద్రతా దళాలు మోహరించిన ఫార్వర్డ్ ప్రదేశాలను ఆయన సందర్శించనున్నారు.

లద్దాఖ్‌ నుంచి శనివారం శ్రీనగర్ వెళ్లనున్న రక్షణ మంత్రి అక్కడ సైనిక ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రతను సమీక్షించనున్నారు. చైనాతో గల్వాన్‌ ఘర్షణ అనంతరం రాజ్‌నాథ్ సింగ్ తొలిసారి లద్దాఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చూడండి: పీఓకేలో వివాదాస్పద డ్యామ్ పనులను ప్రారంభించిన పాక్

Last Updated : Jul 16, 2020, 7:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.