భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూ నియోజకవర్గం నుంచి మరోమారు నామినేషన్ దాఖలు చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ లాంటి దిగ్గజ నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ లోక్‌సభ స్థానం నుంచి 2014లో ఎన్నికయ్యారు రాజ్‌నాథ్.
నామినేషన్‌కు ముందు భారీ రోడ్ షో చేశారు రాజ్‌నాథ్.
వాజ్‌పేయీ ప్రభుత్వంలో మంత్రి..
ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన రాజ్‌నాథ్ సింగ్ 1975లో జనసంఘ్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1977లో మీర్జాపుర్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2013 వరకు రెండుసార్లు భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.