నేడో రేపో బాలాకోట్ వైమానిక దాడి ఉగ్రవాదుల సంఖ్య బయటపడుతుందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. 300 ఫోన్లు బాలాకోట్ దాడులకు ముందు ఆ ప్రాంతంలో పనిచేశాయన్న జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్ఓ) విశ్లేషణను ఉటంకించారు రాజ్‌నాథ్.
అసోంలోని దుబ్రీలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ ప్రాజెక్టును రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రతిపక్షాలు వైమానిక దాడులపై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాదుల మృతదేహాల్ని లెక్కించుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"వైమానిక దాడుల్లో ఎంతమంది మృతి చెందారని కొన్ని పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది మృతి చెందారో నేడో, రేపో బయటపడుతుంది. పాకిస్థాన్ నేతలకు తెలుసు ఎంతమంది మృతి చెందారన్న విషయం"-రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి