ETV Bharat / bharat

'అడగాల్సింది ప్రభుత్వాన్ని.. సైన్యాన్ని కాదు' - బాలాకోట్​

బాలాకోట్​ వైమానిక దాడులపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఎవరికైనా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే సైన్యాన్ని ఆధారాలు అడగటం భావ్యం కాదని ఏఎన్​ఐ ముఖాముఖిలో అన్నారు.

'అడగాల్సింది ప్రభుత్వాన్ని.. సైన్యాన్ని కాదు'
author img

By

Published : Apr 9, 2019, 4:08 PM IST

నిఘా సమాచారంతోనే బాలాకోట్​ వైమానిక దాడులు నిర్వహించామని కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్ తెలిపారు. ఎన్నికల వేళ ఏఎన్​ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు రాజ్​నాథ్.

వైమానిక దాడులపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుంది

"బాలాకోట్ వైమానిక దాడుల గురించి ఎల్​కే అడ్వాణీకి తెలుసు. ఆయనకు ఏళ్ల అనుభవం ఉంది. ఇటువంటి విషయాలపై ఆయనకు ఒకరు వెళ్లి చెప్పాల్సిన అవసరం లేదు.

దేశానికి వ్యతిరేకంగా ప్రశ్నించటం తప్పు. సంబంధిత ప్రశ్నలకు మేం సమాధానాలిస్తున్నాం. మళ్లీ వాయుసేనను ప్రశ్నించటం ఏమిటి? బాంబులు వేసి మృతుల సంఖ్య లెక్కపెడుతూ కూర్చోలేరు కదా. దేశ భద్రత విషయాన్ని రాజకీయం చేయటం ఎంతమాత్రం సమంజసం కాదు. ఏ పార్టీకైనా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. సైన్యం, ప్రభుత్వం దేశానికి బాధ్యత వహిస్తాయి. పార్టీకి కాదు. పాక్​లో కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేశాం. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.

ఇంకో విషయం.. ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ఎప్పుడూ చెప్పలేదు. కేవలం విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. దానికి అవసరమైన దర్యాప్తు బృందాన్ని నియమించాం."

-రాజ్​నాథ్​ సింగ్, కేంద్ర హోంమంత్రి

ఐటీ దాడులపైనా రాజ్​నాథ్ సింగ్ స్పందించారు. ఆదాయపు పన్ను శాఖ, ఈడీ దాడుల్లో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. వాళ్లకున్న సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

మెజారిటీ రాకపోతే తాను లేదా నితిన్ గడ్కరీ ప్రధాని అయ్యే అవకాశముందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు రాజ్​నాథ్. వచ్చే ఎన్నికల్లో భాజపాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మళ్లీ మోదీనే ఉంటారని స్పష్టతనిచ్చారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగమే: రాజ్​నాథ్

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 8 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2022: Venezuela Water Crisis AP Clients Only 4205029
Shantytown residents protest water crisis in Venezuela
AP-APTN-2004: US Nielsen Reaction Must Credit to FOX News Channel, No more than 24-hour use, No more than 60 seconds 4205009
Nielsen: I still support Trump's border goals
AP-APTN-2001: Libya Aftermath AP Clients Only 4205028
Aftermath of attack on Mitiga international airport
AP-APTN-1950: US Border Analysis AP Clients Only 4205027
Trump's immigration focus heightens govt. turmoil
AP-APTN-1921: Russia Erdogan 4 No access Russia/EVN 4205019
Putin meets Erdgan, comment on cooperation
AP-APTN-1911: Brazil Violence PART NO ACCESS BRAZIL 4205016
Brazil army arrests soldiers after family car shooting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.