లాక్డౌన్ సడలింపులతో దేశ రాజధాని దిల్లీ నుంచి వివిధ ప్రధాన నగరాల మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది రైల్వేశాఖ. ఈ ప్రత్యేక రైళ్లు కేవలం ఐదు రోజుల్లో 3.5లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసిందని... తద్వారా రైల్వేశాఖకు రూ.69కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఈ నెల 12 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతుంది. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజల నుంచి ఈ రైళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో పూర్తి సామర్థ్యంతో రైళ్లను నడపడం ప్రారంభించారు అధికారులు.
మరిన్ని వివరాలు..
- మే 16న రాజధాని రైళ్లలో 27,788మంది ప్రయానించారు. ఈ సంఖ్య ఆదివారం నాటికి 30,127కు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,48,634మంది ప్రయాణికులు ప్రయానించారు.
- నేటికి రూ.69,33,67,735 ఆదాయం వచ్చింది. మే 17నాటికి 1,87,827 టికెట్లు బుక్ అయ్యాయి. మే 27వరకు 21రైళ్లు నడుపుతారు.
- ఈ రైళ్లు కేవలం రాజధాని మార్గాల్లో నడుపుతూ... ప్రీమియం ఛార్జీలే వసూలు చేస్తున్నారు.
- మే 17న లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇస్తే దశలు వారిగా రైళ్ల సర్వీసులు పునరుద్ధరిస్తాం. ఏదేమైనా జూన్ 30వరకు సాధారణ ప్రయాణికుల సర్వీసులను ప్రారంభించం.
మే 22నుంచి వర్తిస్తాయ్!
నిజానికి రైళ్లు పునరుద్ధరించిన తొలిదశలో వెయింటిగ్లిస్ట్కు అవకాశం లేదు. అయితే ఈ రైళ్లకు డిమాండ్ పెరగడం వల్ల అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల కోసం వెయిటింగ్ లిస్ట్ 3టైర్ ఏసీ బోగిల్లో 100, 2టైర్ ఏసీ బోగిల్లో 50, స్లీపర్ క్లాస్‌ల్లో 200, సిట్టింగ్ 100 చొప్పున, ఫస్ట్ ఎసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు 20 చొప్పున ఈ జాబితా ఉంటాయి. అయితే ఆర్ఏసీకు ఈ జాబితాకు అవకాశం ఇవ్వలేదు. మే22 నుంచి రైళ్లకు ఈ సడలింపులను అనుమతించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: స్వరాష్ట్రం వచ్చిన 560 మంది వలస కూలీలకు కరోనా