ETV Bharat / bharat

వన్యప్రాణుల సంరక్షకుడిగా మాజీ సైనికుడు - 2018లో ఎర్త్​హీరో అవార్డు గ్రహీత

కేరళలో ఏనుగు మృతిపై దేశమంతా విచారం వ్యక్తం చేసింది. ఈ దారుణం చేసినవారిపై మరికొందరు ఆగ్రహించారు. రాజస్థాన్​లోని ఓ మాజీ జవాను వన్యప్రాణులకే తన జీవితాన్ని అంకితం చేశాడు. వన్యప్రాణుల సంరక్షణకు ఆయన చేసిన కృషికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 'ఎర్త్​ హీరో' పురస్కారాన్ని అందుకున్నాడు. మరి ఆయన కథేంటో చూద్దామా..

Rajasthan's 'earth hero' comes to the rescue of injured animals
మానవత్వానికి మారు పేరు.. వన్యప్రాణులకు వైద్యుడు
author img

By

Published : Jun 4, 2020, 7:54 PM IST

కేరళలో మే 27న జరిగిన గర్భిణీ ఏనుగు హత్య చాలా మందిని కలచివేసింది. మూగజీవంపై ఇంత అమానుషంగా ప్రవర్తించటం మానవత్వానికే మచ్చతెచ్చింది. అయితే దీనికి భిన్నంగా కొన్నేళ్లుగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడుతున్నాడు రాజస్థాన్​కు చెందిన వ్యక్తి. ఐదేళ్ల పాటు సీఆర్​పీఎఫ్​ జవానుగా పనిచేసిన పీరారామ్​ ధాయల్​.. తన మిగిలిన జీవితాన్ని వన్యప్రాణులకు అంకితం చేశాడు.

జాలోర్​ జిల్లా దేవరా గ్రామానికి చెందిన ధాయల్​.. 1990లో ఉద్యోగాన్ని వదిలేశాడు. అనంతరం మూగజీవాల సంరక్షణ కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాడు. గాయపడిన మూగజీవులను రక్షించి, చికిత్స అందించేవాడు. అవి కోలుకున్న తర్వాత అడవిలో వదిలిపెడతాడు. ఇలా కొన్నేళ్లుగా 900 మూగజీవాలకు పైగా రక్షించాడు పీరారామ్​. 2003 నుంచి ఈ పనిని చేస్తున్నాడు.

గార్డెన్​ పెంపకం..

ధాయల్​ 2009లో గ్రామస్థుల సాయంతో జిల్లాలోని హైవేను ఆనుకుని ఉన్న ధామ్నాలో 6,000 మొక్కలు నాటాడు. దీనికి 'అమృత దేవి గార్డెన్​'గా నామకరణం చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే జింకలు, కుందేళ్లు, దుప్పి, కోతులు, నెమళ్లకు చికిత్స అందిస్తున్నాడు. ప్రస్తుతం సుమారు 50 జింకలు గార్డెన్​లో ఉన్నట్లు ధాయల్ చెబుతున్నాడు.

ఫిర్యాదులతో ఆటంకం..

ఆరంభంలో చాలా సమస్యలు ఎదురయ్యాయని పీరారామ్​​ చెప్పుకొచ్చాడు. "తాను అక్రమంగా ఆ భూమిని ఆక్రమించుకున్నానని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేవారు కొంతమంది గ్రామస్థులు. ఫలితంగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు నన్ను హెచ్చరించారు. ఆ వివాదం వల్ల ఆ గార్డెన్​, వన్యప్రాణులను అధికారులకు అప్పగించాను." అని తెలిపాడు.

5 రోజులు వాటి బాగోగులు చూసిన తర్వాత తిరిగి ఆ గార్డెన్​ను పీరారామ్​కే అప్పగించారు అధికారులు. 2017లో గార్డెన్​లోని జంతువులను చూసుకోవడానికి అటవీశాఖ అధికారులు 8మంది సిబ్బందిని నియమించారు.

పురస్కారాలు.. ​

పీరారామ్​ కృషిని గుర్తించిన ప్రభుత్వం ఎర్త్​ హీరో పురస్కారానికి ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా ఎర్త్​ హీరో- 2018 అవార్డును పొందాడు పీరారామ్​. 2018-2019లో 'వైల్డ్​లైఫ్​ కన్జర్వేషన్​'​ అవార్డు కూడా అందుకున్నాడు​.

మానవత్వానికి మారు పేరు.. వన్యప్రాణులకు వైద్యుడు

ఇదీచూడండి: ఆ రాష్ట్రంలో మరో ఏనుగు గాథ.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.