రిజర్వేషన్ వ్యవహారంలో రాజస్థాన్‌లో గుర్జర్లు మరోమారు ఆందోళన బాటపట్టారు. భరత్‌పుర్‌లోని బయానాలో కొందరు యువకులు.. రైల్వేట్రాక్‌పై బైఠాయించారు. ఫలితంగా హిణ్డైన్ సిటీ-బయానా మార్గంలో ప్రయాణించే 7 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ఈ ఆందోళనలతో దిల్లీ-ముంబయి రైలు మార్గంలో ట్రాఫిక్‌పై ప్రభావం పడుతుందని చెప్పారు.
గుర్జర్ ఆరాక్షన్ సంఘర్ష్ సమితి ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు కొన్ని జిల్లాల్లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.
గుర్జర్ల డిమాండ్లివే..
- రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలి.
- ఖాళీల బ్యాక్‌లాగ్‌లను త్వరితగతిన భర్తీ చేసి, పెండింగ్‌లో ఉన్న నియామక ప్రక్రియలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) వారికి 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలి.
- 14 పాయింట్ల ఒప్పందం ప్రకారం.. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న 1,252 మంది ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ ఆధారంగా వేతనాలివ్వాలి.
ఇదీ చదవండి: అరెస్టులకు దారితీసిన వల్లభ్‌గఢ్ మహాపంచాయతీ