రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 103 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ స్వరూప్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న రోహిత్ కుమార్ సింగ్‌కు హోం కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి ఆరోగ్య విభాగ బాధ్యతలను అఖిల్ అరోరా నిర్వర్తిస్తున్నారు. బదిలీ చేసిన జాబితాలో ముగ్గురు అదనపు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు డివిజినల్ కమిషనర్లు, 15 మంది కలెక్టర్లు ఉన్నారు.
అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి బి గుప్తా గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గుప్తా ఈ ఏడాది సెప్టెంబర్‌లో, రాజీవ్ స్వరూప్ అక్టోబర్‌లో పదవీ విరమణ కానున్నారు.