రాజస్థాన్లోని హిండౌన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరోసీలాల్ జాటవ్పై పట్టపగలు ఓ యువకుడు కాల్పులు జరిపాడు. గాయపడిన జాటవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాటవ్ తన గృహంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది.
"ఆ వ్యక్తి నన్ను చంపేందుకు ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. నాపై దాడి చేసిన తర్వాత అతను పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కచ్చితంగా అతడికి శిక్ష పడుతుంది."
- భరోసీలాల్ జాటవ్
ఎమ్మెల్యేపై దాడి... స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. ఫలితంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరా తీశారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.