ఆరుగాలం శ్రమించి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో రాజస్థాన్ జైపుర్ జిల్లా డూడూ ప్రాంత రైతులు 'ఛలో దిల్లీ' కార్యక్రమం తలపెట్టారు. కేంద్రప్రభుత్వానికి తమ గోడు వినిపించేందుకు డూడూ నుంచి ర్యాలీగా హస్తిన బయలుదేరారు.
'మొత్తం 26.75 లక్షల టన్నుల శెనగ పంటలో కేంద్రం 6 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' నినాదానికి వ్యతిరేకం' అని వాపోయాడు కిసాన్ మహా పంచాయత్ ప్రతినిధి రామ్‌పాల్ జాట్.
ఇదీ చూడండి: గాంధీలకు షాక్.. రాజీవ్ ఫౌండేషన్‌పై విచారణకు కమిటీ