ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యలు చేయటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న కళ్యాణ్ ఎన్నికల నియమాళికి విరుద్ధంగా వ్యవహరించారని తప్పుబట్టింది. ఈ విషయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాయనున్నారని సమాచారం.
గత నెలలో పార్టీ టికెట్ కోసంపెద్ద సంఖ్యలో భాజపా కార్యకర్తలు కళ్యాణ్ సింగ్‌ను సంప్రదించారు. అలీగఢ్‌లోని గవర్నర్ నివాసం ముందు నిరసనలు కూడా చేపట్టారు. వారిని శాంతింపజేసేందుకు మోదీకి మద్దతుగా కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
" మనమందరం భాజపా కార్యకర్తలం, మరోసారి మోదీ ప్రధాని అయ్యే దిశగా కృషి చేయాలి. మోదీ ప్రధాని కావటం అత్యవసరం."
- కళ్యాణ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్
1990లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గుల్షెర్ అహ్మద్ కూడా ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొన్నారు. తన కొడుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు అహ్మద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు గుల్షెర్ అహ్మద్.
ఇదీ చూడండి :తెలుగు సహా 9 భాషల్లో వెబ్సైట్ పూర్తిపేరు!