ETV Bharat / bharat

జవాన్ల కోసం సంగీత విభావరి- కాసుల వర్షం - గుజరాత్

సైనికుల సంక్షేమం కోసం వివాహ వేడుకలో భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది ఓ నూతన జంట. విరాళాలు సేకరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో గాయని పాడేటప్పుడు మన దేశ కరెన్సీతో పాటు డాలర్లు వర్షంలా కురిశాయి. ఈ డబ్బునంతా సైనికుల సహాయ నిధికి అందజేస్తానని చెప్పారు వరుడు పార్థ్​నాయక్​.

జవాన్లకు సాయం చేసేందుకు పెళ్లిలో కచేరి
author img

By

Published : May 8, 2019, 12:25 PM IST

జవాన్లకు సాయం చేసేందుకు పెళ్లిలో కచేరి

పెళ్లిలో వినోదం కోసం సంగీత కార్యక్రమాలు నిర్వహించడం సర్వసాధారణం. అయితే గుజరాత్​లోని కడోదరాలో ఓ కొత్త జంట వినూత్న ఆలోచన చేసింది. వినోదం కోసం కాకుండా దేశం కోసం త్యాగాలు చేస్తున్న జవాన్ల కోసం భజన ఏర్పాటు చేయాలనుకున్నారు ఆ వధూవరులు. వివాహం తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేశారు. గాయని పాట పాడుతున్న సమయంలో ప్రేక్షకులు నోట్లను వర్షంలా కురిపించారు. అందులో డాలర్లూ ఉన్నాయి. వధూవరులూ నగదును ధారాళంగా సమర్పించారు.

చిన్నప్పటి నుంచి తనకు సైన్యం అంటే చాలా ఇష్టమని, కానీ కొన్ని కారణాల వల్ల సైన్యం చేరలేకపోయానని చెప్పారు పెళ్లికొడుకు పార్థ్​నాయక్​. పెళ్లి కుదిరినప్పుడే సైనికుల కోసం విరాళాలు సేకరించేందుకు భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. దేశం కోసం ఆలోచించే భర్త దొరికినందుకు గర్వంగా ఉందన్నారు పెళ్లి కూతురు.

ఇదీ చూడండి: చిత్రవిచిత్ర దుస్తులు.. వేదికపై హొయలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.