ETV Bharat / bharat

కాంట్రాక్ట్​ ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లిస్తాం: రైల్వే - రైల్వే కాంట్రాక్ట్​ ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లింపు

కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో రైళ్లు, స్టేషన్లు, కార్యాలయాల్లో సేవలు అందిస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది రైల్వే శాఖ .

Railways to release full salary to lakhs of contractual workers during suspension of service
రైల్వే కాంట్రాక్ట్​ ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లింపు
author img

By

Published : Mar 24, 2020, 6:55 PM IST

లక్షలాది మంది ఒప్పంద ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు రైలు సేవలన్నీ నిలిపివేసినప్పటికీ, కాంట్రాక్ట్​ ఉద్యోగుల పూర్తి జీతం విడుదల చేయాలని నిర్ణయించింది.

"కరోనాను నియంత్రించేందుకు ప్రస్తుతం రైల్వే సేవలను నిలిపివేశాం. ఫలితంగా ఆన్​-బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్, పారిశుద్ధ్యం, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక మంది కాంట్రాక్ట్​ సిబ్బంది విధుల నుంచి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఒప్పంద ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి. మిగిలిన వారు సమాచారం అందించిన వెంటనే విధులకు హాజరుకావడానికి సిద్ధంగా ఉండాలి."

- రైల్వేశాఖ

ఒప్పంద ఉద్యోగులకు (తాత్కాలిక, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్) చెల్లించే గరిష్ఠ మొత్తం... కాంట్రాక్ట్​ విలువలో 70 శాతానికి పరిమితం అవుతుందని రైల్వే బోర్డు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రైల్వే జోన్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్- వీడియో కాన్ఫరెన్స్​లోనే పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.