ETV Bharat / bharat

1074 శ్రామిక్​ రైళ్లల్లో 14లక్షల మంది ప్రయాణం - lockdown train news

దేశవ్యాప్తంగా భారత రైల్వే వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు .. ఇప్పటి వరకు దాదాపు14 లక్షల మందిని సొంతూళ్లకు చేర్చాయన్నారు రైల్వే మంత్రి పీయూష్​ గోయల్. కార్మికుల కోసం రోజుకు 300 రైళ్లు నడిపే సామర్థ్యం ఉందని తెలిపారు​. ఇకపై రోజుకు సుమారు మూడు లక్షలకుపైగా వలస కార్మికులను రవాణా చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

railways-operated-1034-shramik-trains-since-may-1-goyal
'ఒక్కరోజులో 300 రైళ్లు నడపగలం'
author img

By

Published : May 16, 2020, 5:39 PM IST

లాక్​డౌన్​ వేళ భారత రైల్వే నడిపిన 1074 'శ్రామిక్' రైళ్లలో... ఇప్పటివరకు దాదాపు 14 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారని రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ ప్రకటించారు. వలసదారులను ఇంటికి చేర్చేందుకు రాష్ట్రాల నుంచి 15 రోజుల్లో వెయ్యికి పైగా ఆమోదాలు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ వలస కూలీల్లో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్​, బిహార్​ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.

రోజుకు 300 రైళ్లు..

వలసదారుల కోసం ఉత్తర​ప్రదేశ్​, బిహార్​ రాష్ట్రాల్లో రైల్వే అందించిన సేవలను ప్రశంసించారు గోయల్. కేవలం ఈ రెండు రాష్ట్రాలకే 80శాతం కార్మికులు చేరినట్టు తెలిపారు.

  • कामगारों को वापस घर लाने के लिए अब तक 1,034 श्रमिक स्पेशल ट्रेनों को चलाया गया है। जिसमे से 106 ट्रेन कल संचालित हुई।

    उत्तर प्रदेश व बिहार ने इस दिशा बहुत तेजी से कदम उठाए हैं, और देश भर में चली कुल श्रमिक स्पेशल ट्रेनों में से लगभग 80% ट्रेन इन दोनों राज्यों द्वारा चलाई गई हैं। pic.twitter.com/S3zxs9ylm4

    — Piyush Goyal (@PiyushGoyal) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గడిచిన మూడు రోజుల్లో.. సుమారు రెండు లక్షలకుపైగా వలస కార్మికులను రవాణా చేసినట్లు పీయుష్​ గోయల్​ వెల్లడించారు. ఇకపై రోజుకు మూడు లక్షలకుపైగా కార్మికులను స్వగ్రామాలకు చేర్చేందుకు యోచిస్తున్నట్టు వివరించారు.

రోజుకు 300 రైళ్లు నడిపే సామర్థ్యం రైల్వేకు ఉందన్నారు గోయల్​. ఇకపై ప్రయాణికుల సౌకర్యార్థం మూడు స్టేషన్లలో రైళ్లు ఆగనున్నట్టు తెలిపారు.

ఆమోదించండి..

ఉత్తరప్రదేశ్​ 526 రైళ్లను నడిపేందుకు ఆమోదించగా, బిహార్​ 269, మధ్యప్రదేశ్​ 81 రైళ్ల కూతకు పచ్చ జెండా ఊపాయి. బంగాల్, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​ రాష్ట్రాలు మరిన్ని రైళ్లను ఆమోదించాలని మంత్రి పీయూష్​ గోయల్ కోరారు.

ఖర్చెంతో..

ప్రయాణికులకు స్క్రీనింగ్​ నిర్వహించి.. ఉచిత భోజనం, మంచి నీటి సదుపాయం కల్పించింది రైల్వే. ఒక్క ట్రైన్​లో కేవలం 1200 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతించింది. గత సోమవారం నుంచి 1700 మందికి ప్రయాణించే అవకాశం కల్పించింది.

శ్రామిక్​ రైళ్ల సేవలకు ఎంత ఖర్చు అవుతుందో రైల్వే ప్రకటించలేదు. అయితే, దాదాపు రూ.80 లక్షలు ఖర్చవుతున్నట్లు సమాచారం. వలస కార్మికుల రవాణా ఖర్చులను కేంద్రం, రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో భరిస్తున్నాయి.

ఇదీ చదవండి:మరో ఘోరం: సొంతగూటికి చేరేలోగా మృత్యు ఒడికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.