ETV Bharat / bharat

వైరస్​పై పోరు: 4 రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్​ల మోహరింపు - కరోనా కేసులు

కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మొత్తం నాలుగు రాష్ట్రాల కోసం 204 రైల్వే కోచ్​లను సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో దిల్లీకి 54, ఉత్తరప్రదేశ్​కు 70 కేటాయించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో దిల్లీలోని వైరస్ బాధితుల కోసం 500 కోచ్​ల వరకు సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.

Railways deploys 204 isolation coaches in 4 states; 54 in Delhi to boost COVID-19 capacity
కరోనా బాధితుల కోసం 204 రైల్వే కోచ్​లు సిద్ధం
author img

By

Published : Jun 14, 2020, 11:19 PM IST

Updated : Jun 14, 2020, 11:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని వైరస్ బాధితులకోసం 204 కోచ్​లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు రైల్వే అధికారులు. ఇందులో దిల్లీ కోసం శకుర్​బస్తీ రైల్వేస్టేషన్​లో 54 కోచ్​లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో దిల్లీలోని మహమ్మారి బాధితుల కోసం ఐసోలేషన్ కోచ్​ల సంఖ్య 500 వరకు పెంచుతామని స్పష్టం చేశారు.

దిల్లీలో వైరస్ విజృంభణపై సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పడకల కొరత దృష్యా అన్ని సౌకర్యాలతో కూడిన 500 రైల్వే కోచ్​లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పడకలను సిద్ధం చేస్తుంది రైల్వేశాఖ.

ఉత్తర్​ప్రదేశ్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, దిల్లీ రాష్ట్రాలు 5 వేల సాధారణ కోచ్​లను కొవిడ్​ కేంద్రాలుగా మార్చాలని కోరినట్లు తెలిపారు. ఉత్తర్​ప్ర​దేశ్​కు 70, దిల్లీకి 54, తెలంగాణకు 60, ఆంధ్రప్రదేశ్​కు 20 కోచ్​లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 24 ప్రాంతాలకు గాను ఉత్తరప్రదేశ్ 240 కోచ్​లను, తెలంగాణ 60, దిల్లీ 10 కోచ్​లను కోరినట్లు తెలిపారు.

మొత్తం 160 పడకల సామర్థ్యం కలిగిన 10 కోచ్‌లను దిల్లీలోని శకుర్‌బస్తీ స్టేషన్‌లో మే 31 న మోహరించగా... ఇప్పుడు మరో 44 బోగీలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కోచ్​ల్లో ఆక్సిజన్ సిలిండర్లు, దుప్పట్లు, వైద్య సామాగ్రి, ఐసోలేషన్​కు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వారికి సేవలందించే విధంగా వీటిని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కోచ్​లను ఐసోలేషన్​ వార్డుగా మార్చినందుకు ప్రతి కోచ్​కు రూ. 2 లక్షలు ఖర్చు అవుతోందని వెల్లడించారు.

ఇదీ చూడండి:'3టీ వ్యూహంతోనే వైరస్​పై విజయం'

Last Updated : Jun 14, 2020, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.