విమానాశ్రయాల్లో వినియోగ ఛార్జీల తరహాలో త్వరలో రైల్వే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేయనున్నారు. దేశంలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. వీటిని వాడుకునే ప్రయాణికుల నుంచి నామమాత్రంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు.
ఈ విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. దేశంలోని పది నుంచి 15 శాతం స్టేషన్లకే ఈ యూజర్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు.
ఇదీ చూడండి: '109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్ల కూత!'