దిల్లీ-అటారీ మధ్య నడిచే సంఝౌతా లింక్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. పాకిస్థాన్ తన వైపు నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తరువాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
"లాహోర్ నుంచి అత్తారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. బదులుగా దిల్లీ-అత్తారీ మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశాం."
- దీపక్ కుమార్, ప్రధాన ప్రజాసంబంధాల అధికారి, ఉత్తర రైల్వే
ఆదివారం ప్రయాణం కోసం ఇద్దరు వ్యక్తులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్ టికెట్లు బుక్ చేసుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు.
సంఝౌతా లింక్ ఎక్స్‌ప్రెస్
భారత్‌లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దిల్లీ నుంచి అత్తారీకి నడిచేది. పాకిస్థాన్... లాహోర్ నుంచి అత్తారీకి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నడిపేది. ప్రయాణికులు అత్తారీ స్టేషన్లో రైళ్లు మారేవారు.
ఇదీ నేపథ్యం
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఫలితంగా పాక్-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ప్రతీకార చర్యగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్, థార్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేసింది.
ఇదీ చూడండి: ఆగస్ట్ 15లోగా 2కోట్ల మందికి కిసాన్ మాన్‌ధన్