ETV Bharat / bharat

కరోనా కాలంలోనూ అదరగొట్టిన రైల్వే! - కిసాన్ రైళ్లు రైల్వే శాఖ

ఈ ఏడాది రైల్వే పురోగతి, సాధించిన విజయాలపై ఆ శాఖ బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సరకు రవాణా 2 శాతం మాత్రమే తక్కువగా నమోదైనట్లు తెలిపారు. రైళ్ల వేగం గణనీయంగా పెరిగిందన్నారు. రైల్వే శాఖ చేపట్టిన ప్రాజెక్టులు, వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న పనుల గురించి వివరించారు.

railway
కరోనా కాలంలోనూ అదరగొట్టిన రైల్వే!
author img

By

Published : Dec 26, 2020, 4:19 PM IST

ఒకరోనా కాలంలోనూ రైల్వే శాఖ అదరగొట్టింది. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది రైల్వేలో 98 శాతం సరుకు రవాణా జరిగింది. కేవలం 2 శాతమే తక్కువగా నమోదైంది. సరుకు రవాణా రైళ్ల వేగం గణనీయంగా పెరిగింది. 2019 డిసెంబర్‌ కంటే 2020 డిసెంబరులో 92 శాతం అధిక వేగంతో గూడ్స్ రైళ్లు నడిచాయి. గత సంవత్సరంతో పోల్చితే ఏప్రిల్-డిసెంబర్‌ కాలంలో 82 శాతం ఎక్కువ వేగంతో ఈ రైళ్లు ప్రయాణించాయి.

కిసాన్ రైళ్లు..

ఈ ఏడాదిలో కిసాన్ స్పెషల్ రైలు నడపడం ఓ ప్రత్యేకత. దేవ్లాలి నుంచి దానపూర్ వరకు మొదటి కిసాన్ రైలు ప్రారంభమైంది. డిమాండ్ దృష్ట్యా ముజఫర్‌పూర్‌ వరకు ఈ రైలును పొడగించారు. ప్రస్తుతం 9 రూట్లలో కిసాన్ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 27 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసినట్లు వీకే యాదవ్ తెలిపారు. కిసాన్‌ ప్రత్యేక రైళ్ల కారణంగా.. రైతుల పంటలకు మార్కెట్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు.

ఎల్​హెచ్​బీ కోచ్​లు..

అన్ని రైలు బోగీలను ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చడమే లక్ష్యంగా పని జరుగుతోందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్మాణానికి స్వావలంబన భారత్‌ కింద ఎక్కువ ప్రాధాన్యతతో పని చేస్తున్నట్లు వెల్లడించారు.

"120 కిలోమీటర్ల వేగంతో నడిచే 9000 హార్స్‌పవర్ ఫ్రైట్ లోకోమోటివ్ ఇంజన్లు 10,000, 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే 12000 హార్స్‌పవర్ ప్యాసింజర్ లోకోమోటివ్‌లు మేక్ ఇన్ ఇండియా కింద నిర్మిస్తాం. 2022 డిసెంబర్ నాటికి మొదటి లోకోమోటివ్ ప్రారంభమవుతుంది."

-వినోద్ కుమార్ యాదవ్, రైల్వే బోర్డు ఛైర్మన్

మరోవైపు, చార్​ధామ్ యాత్రికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. నాలుగు శైవధామాలను కలుపుతూ నిర్మించే రైల్వే లైను నిర్మాణానికి డీడీఆర్ సిద్ధమైనట్లు తెలిపింది. డిసెంబర్ 2024 నాటికి 125 కిలోమీటర్ల పొడవైన రుషికేశ్-కర్న్‌ప్రయాగ్ రైలు లింక్ పూర్తవుతుందని వెల్లడించింది. రామేశ్వరం ఆధునిక పంబన్ వంతెన అక్టోబర్ 2021 నాటికి పూర్తవుతుందని పేర్కొంది.

హైస్పీడ్ బుల్లెట్ రైలు

బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు 1396 హెక్టార్లలో 949 హెక్టార్ల భూమిని రైల్వే స్వాధీనం చేసుకుందని వీకే యాదవ్ తెలిపారు. గుజరాత్‌లో 90 శాతం వరకు భూసేకరణ పూర్తయిందని, మహారాష్ట్రలోని థానేలో భూసేకరణలో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భూసేకరణ దశలవారీగా జరుగుతుందని చెప్పారు. రాబోయే 4 నెలల్లో 80 శాతం వరకు భూమిని స్వాధీనం చేసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. వెంటనే ఆ భూమి రైల్వే పరిధిలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

బుల్లెట్ రైలు మొత్తం ప్రాజెక్టును ఒకేసారి ప్రారంభించడానికి భారత రైల్వే అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు వీకే యాదవ్. సాధారణంగా 80శాతం భూసేకరణ తరువాత.. మిగిలిన 20శాతం భూమిని స్వాధీనం చేసుకోవడానికి హామీ ఇస్తేనే టెండర్ జారీ అవుతుందని... మహారాష్ట్రలో భూసేకరణలో ఆలస్యం జరిగితే... గుజరాత్‌లో దీనికి సంబంధించిన మిగిలిన కార్యకాలపాలు పూర్తి అవుతాయని చెప్పారు. మొదటి దశ బుల్లెట్ రైలును 325 కిలోమీటర్ల నిడివిలో... వాపి వరకు నడిపే అవకాశం ఉందన్నారు.

విజయాలు, ప్రాధాన్యాలివే..

ఆహార ధాన్యాలు, బొగ్గు, ఎరువులు, ఔషధాలతో సహా అన్ని అవసరమైన వస్తువులను దేశంలోని వివిధ ప్రదేశాలకు రవాణా చేయడం కరోనా కాలంలో భారత రైల్వే సాధించిన అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు యాదవ్. కార్మికుల కోసం లేబర్ స్పెషల్ రైలును నడపడం కూడా ఒక పెద్ద విజయమన్నారు. కరోనా సంక్షోభ కాలంలో ప్రయాణికుల రైలును నడపడం ద్వారా గమ్యాన్ని చేరుకోవడం కూడా మరో పెద్ద విజయం. భద్రతను పెంచుతూ.. డిమాండ్‌ ప్రకారం రవాణా, ప్యాసింజర్ రైళ్లు నడపడమే కొత్త సంవత్సర ప్రాధాన్యతగా రైల్వేలు నిర్దేశించుకున్నాయని వివరించారు.

ఇదీ చదవండి: 'రైతు' ఆందోళనలతో రైల్వేశాఖకు భారీ నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.