రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అదనపు మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను గోయల్‌కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రాంవిలాస్ పాసవాన్ మృతితో ఆయా మంత్రిత్వ శాఖలకు ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రపతి భవన్.