కరోనా విపత్తు నేపథ్యంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వేలు ఆలోచన చేస్తున్నాయి. ప్యాంట్రీ కార్ సేవలను తొలగించి వాటిస్థానంలో మూడో తరగతి ఏసీ బోగీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. త్వరలో ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
దేశంలో సుదూరంగా ప్రయాణించే దాదాపు 300 రైళ్లలో ఈ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రూ.1,400 కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే శాఖ.
స్టేషన్లలోనే..
కరోనా కారణంగా ప్రస్తుతం ప్యాంట్రీ సేవలను రైల్వేలు నిలిపేశాయి. దీనిని కొనసాగించి స్టేషన్లలోని ఐఆర్సీటీసీ ఆధారిత కిచెన్ సేవలను వినియోగించుకోవాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సూచనలు వస్తున్నాయి.
ఈ సిఫార్సులపై సమీక్షించాలని రైల్వే బోర్డుతో సహా అన్ని జోన్లను కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఆదేశించారు.
ఇదీ చూడండి: ఏనుగులను ఢీకొట్టిన రైలు ఇంజిన్ సీజ్