ETV Bharat / bharat

'మహా' విషాదం: భవనం కూలిన ఘటనలో 16 మంది బలి - మహా భవనం కూలిన ఘటనలో 16 మంది మృతి

మహారాష్ట్ర రాయ్​గఢ్​ జిల్లా మహద్​ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు. ఓ నాలుగేళ్ల బాలుడితో సహా మొత్తం 61 మందిని రక్షించినట్లు వెల్లడించారు.

Raigad Building Collapse: Death toll rises to 16
మహా భవనం కూలిన ఘటనలో 16కు చేరిన మరణాలు
author img

By

Published : Aug 26, 2020, 10:32 AM IST

మహారాష్ట్ర రాయ్​గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు.

Raigad Building Collapse: Death toll rises to 16
కూలిన భవనం

సోమవారం సాయంత్రం భవనం కూలిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్​డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది ఇప్పటివరకు 16 మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింది నుంచి.. ఓ నాలుగేళ్ల బాలుడు సహా మొత్తం 61 మందిని రక్షించినట్లు మహారాష్ట్ర అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు 90 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుమానంతో ఎన్​డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ తెలిపారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి చైనాకు చెక్​: లద్దాఖ్​కు కొత్త రోడ్డు మార్గం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.