ETV Bharat / bharat

'రాహుల్ బాధంతా హోటళ్లు, బాటిళ్ల గురించే'

author img

By

Published : Oct 11, 2020, 11:25 AM IST

రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇటలీలో కూర్చొని భారత్​ గురించి ఆలోచిస్తారని విమర్శలు గుప్పించారు. ఆయన బాధంతా హోటళ్లు, బాటిళ్ల గురించే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

rahul-worries-only-about-hotels-bottles-bjp-mla-surendra-singh
'రాహుల్ బాధంతా హోటళ్లు, బాటిళ్ల గురించే'

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శల దాడికి దిగారు ఉత్తర్​ప్రదేశ్ రోహ్నియా భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. రాహుల్ మానసిక రోగంతో బాధపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటలీలోని హోటల్​లో కూర్చొని భారత్​ గురించి ఆలోచిస్తారని ఆరోపించారు. వైకల్యం ఉన్న వారికి ఊతకర్ర ఎంత అవసరమో రాహుల్​కు కూడా మరొకరి సలహాలు అలాగే అవసరమన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉంటే 15 నిమిషాల్లోనే సరిహద్దు నుంచి చైనా బలగాలను వెనక్కి పంపించే వాళ్లమని ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సురేంద్ర సింగ్. రాహుల్​కు సలహాలు ఇచ్చే వారు ఎవరూ లేకే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని అంతం చేయవచ్చని రాహుల్ కలలు కంటున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

" రాహుల్ బాధంతా హోటళ్లు, బాటిళ్లపైనే. ఆయన తాతగారు చైనాకు భూభాగం అప్పగించినట్లే ఆయన కుటుంబ సభ్యులు కూడా డ్రాగన్ దేశానికి ఏదో ఒకటి ఇచ్చారు. దేశం కోసం ఎంతో కొంత చేసిన ఇందిరా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలి."

- సురేంద్ర సింగ్​, భాజపా ఎమ్మెల్యే

తల్లిదండ్రులు తమ కూతుళ్లకు విలువలు నేర్పితేనే అత్యాచారాలను అడ్డుకోగలమంటూ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు సురేంద్ర సింగ్. ఇప్పుడు రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు.

ఇదీ చూడండి: 'కూతుళ్లకు విలువలు నేర్పితే అత్యాచారాలు ఆగుతాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.