కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు దిల్లీలో రాహుల్‌గాంధీ భేటీకానున్నారు. మే నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీ పాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు అశోఖ్ గహ్లోత్, కమల్‌నాథ్, అమరేందర్ సింగ్, భుపేష్ బఘేల్ సోమవారం మధ్యాహ్నం జరగనున్న సమావేశానికి హాజరుకానున్నారు. ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో రాహుల్ కొనసాగాలని ముఖ్యమంత్రులు కోరనున్నారు. అయితే నిర్ణయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే రాహుల్ పట్టు పట్టారు.
పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నట్టు మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశంలో రాహుల్ ప్రకటించారు. ఈ సమావేశంలోనే కమల్‌నాథ్, గహ్లోత్లపై పరోక్ష విమర్శలు చేశారు రాహుల్.
ఇదీ చూడండి: స్విస్ ఖాతాల్లో తగ్గిన భారత సొమ్ము