జీ-20 దేశాల ప్రతినిధులు, రాయబారులతో నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమవ్వనున్నారు. దిల్లీలోని ఓ ప్రైవేటు హొటల్లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమానికి రాహల్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.
గత నెల 15 నే జీ-20 దేశాల ప్రతినిధులు, రాయబారులతో ఈ సమావేశం జరగాల్సి ఉన్నా పుల్వామా ఉగ్రదాడితో నేటికి వాయిదా పడింది.