భాజపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జార్ఖండ్‌లోని చాయ్బసలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనుల వనరులను సంరక్షిస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్. ఆదివాసీల సొమ్మును మోదీ తీసుకుని... ధనిక వ్యాపారుల చేతిలో పెట్టారని విమర్శించారు.
"ఒక్కసారి మీ జేబులోంచి పర్సు తీసి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. మీ పర్సుల నుంచి డబ్బులను ప్రధాని మోదీ తీసుకున్నారు. మీ అడవులు, నీళ్లు, భూమిని సరిగా చూడండి. మీకే అర్థమవుతుంది. మీ నీళ్లను, అడువులను, భూములను అనిల్ అంబానీకి ప్రధాని ఇచ్చారు."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.
గిరిజనుల నీరు, అడవి, భూమిని కాపాడడం కాంగ్రెస్‌కు మాత్రమే సాధ్యమని అన్నారు రాహుల్.
ఇదీ చూడండి: 'ఓటు స్లిప్పుల' లెక్కపై రివ్యూ పిటిషన్ కొట్టివేత