పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ సర్కార్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) ధరల పెంపులో మోదీ సర్కార్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధపడుతుంటే మోదీ సర్కార్ మాత్రం పన్ను వసూళ్లలో బిజీగా ఉంది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 85.7గా ఉండగా ముంబయిలో రూ.92.2గా ఉంది.
లీటర్ డీజిల్ ధర దిల్లీలో రూ.75.8కి చేరగా ముంబయిలో రూ.82.6కు పెరిగింది.
- ఇదీ చూడండి:సరికొత్త గరిష్ఠాలకు పెట్రో, డీజిల్ ధరలు