ఇప్పటికే వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. గుజరాత్‌లోని రెండు కోర్టులు రాహుల్‌కు సమన్లు జారీ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై హత్య ఆరోపణలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు భాజపా నేతలు. ఆగస్టు 9న కోర్టు ఎదుట హాజరుకావాలని అహ్మదాబాద్‌లోని న్యాయస్థానం ఆదేశించింది.
'మోదీ' పేరుపై సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టును ఆశ్రయించారు భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. తమ మనోభావాలు దెబ్బతినేలా రాహుల్ వ్యాఖ్యానించారని మంగళవారం కోర్టులో విచారణ సమయంలో పూర్ణేశ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జులై 16న విచారణకు హాజరు కావాలని రాహుల్‌ను ఆదేశించారు సూరత్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిపై ఇప్పటికే పలు పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. గతవారం ముంబయి, పట్నా కోర్టుల ఎదుట విచారణకు హజర్యయ్యారు. ఆ తర్వాత రాహుల్‌కు బెయిల్ మంజూరు అయ్యింది.
ఇదీ చూడండి: 8 నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవం!