కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమాన ఇంజిన్‌కు సాంకేతిక సమస్య ఎదురైంది. బిహార్‌లోని సమస్తిపుర్‌లో ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఫలితంగా... విమానాన్ని వెంటనే దిల్లీకి మళ్లించారు. రాహుల్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు.
"ఈరోజు పట్నాకు వెళ్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. అందుకే దిల్లీకి తిరుగు పయనమవ్వక తప్పలేదు. సమస్తిపుర్(బిహార్), బాలేశ్వర్(ఒడిశా), సంగమ్నార్(మహారాష్ట్ర)లో ఈ రోజు జరగాల్సిన సభలు ఆలస్యంగా జరుగుతాయి. అసౌకర్యానికి క్షమాపణలు."
- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఇద్దరు విమాన సిబ్బందితో కలిపి మొత్తం పది మందితో వెళ్తున్న రాహుల్ విమానం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు సురక్షితంగా దిల్లీలో దిగింది.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గతంలోనూ ఇలా
రాహుల్ గాంధీ విమానంలో సాంకేతిక లోపం రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సరిగ్గా ఇదే రోజు... అంటే ఏప్రిల్ 26న దిల్లీ నుంచి కర్ణాటక హుబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఇదే అనుభవం ఎదురైంది. అయితే విమానం ఏ ప్రమాదానికి గురవకుండా జాగ్రత్తగా కిందకు దిగగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటనతో రాహుల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. అదే ఏడాది ఆ యాత్ర పూర్తిచేశారు.