ETV Bharat / bharat

'ఖేతీ బచావో యాత్ర' ప్రారంభించనున్న రాహుల్​ గాంధీ - కాంగ్రెస్​ ఆందోళనలు

వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేపట్టే ఖేతీ బచావో యాత్రను పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​తో కలిసి ప్రారంభించనున్నారు రాహుల్​ గాంధీ. పంజాబ్​ నుంచి దిల్లీ వరకు 3 రోజుల పాటు సాగే యాత్రలో ట్రాక్టర్​ ర్యాలీలు, రోడ్​ షోలు చేపట్టనున్నారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Oct 4, 2020, 11:54 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు ప్రణాళిక చేస్తోంది కాంగ్రెస్​. అందులో భాగంగానే పంజాబ్​ నుంచి 'ఖేతీ బచావో (వ్యవసాయాన్ని రక్షించండి) యాత్ర'ను ఆదివారం ప్రారంభించనున్నారు కాంగ్రెస్​ నేత రాహూల్​ గాంధీ. పంజాబ్​ నుంచి దిల్లీ వరకు 3 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ట్రాక్టర్లతో ర్యాలీలు, రోడ్​ షోలు సహా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

యాత్ర ప్రారంభం సందర్భంగా మోగా జిల్లాలోని బధ్నికలాన్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్​ గాంధీ. అనంతరం పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ సహా ఇతర రాష్ట్ర సీనియర్​ నేతలతో కలిసి యాత్రను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బధ్నికలాన్​ నుంచి జత్​​పురా వరకు ట్రాక్టర్​ ర్యాలీకి నేతృత్వం వహిస్తారు. జత్​పురాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించి.. యాత్ర తొలి రోజును ముగిస్తారు.

2 కోట్ల మంది రైతుల సంతకాలతో..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఆందోళనలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించింది కాంగ్రెస్​. కొన్ని కార్యక్రమాలను సెప్టెంబర్​ 24నే ప్రారంభించింది. అవి నవంబర్​ 14తో ముగియనున్నాయి. కాంగ్రెస్ చేపట్టే​ ఆందోళనలు చివరకు రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు మెమోరెండం ఇచ్చిన తర్వాత పూర్తవుతాయి.

ఇదీ చూడండి: కొత్త చట్టాలతో 'మద్దతు ధర'కు ఇక మంగళమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.