రఫేల్ తీర్పుపై తన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు తప్పుగా ఆపాదించారని సుప్రీంకోర్టుకు వివరించారు రాహుల్ గాంధీ. రఫేల్ వ్యవహారంలో భాజపా ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై సుప్రీం కోర్టు వివరణ కోరగా.. రాహుల్ అఫిడవిట్ సమర్పించారు.
రాహుల్ గాంధీ ఆపాదించిన 'చౌకీదార్ చోర్ హై' అనే అభ్యంతరకర వ్యాఖ్యలు రఫేల్ తీర్పులో ఎక్కడా ప్రస్తావించలేదని ఈ నెల 15న సుప్రీం స్పష్టం చేసింది. భాజపా ఎంపీ మీనాక్షి వేసిన పిటిషన్పై ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీకి నోటీసులిచ్చింది. రాహుల్ ప్రమాణ పత్రంపై మంగళవారం విచారణ జరగనుంది.
ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించారని అఫిడవిట్లో పేర్కొన్నారు రాహుల్. కోర్టు ప్రతిష్ఠను తగ్గించాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ కూడా రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారని... ప్రభుత్వానికి సుప్రీం తీర్పుతో సచ్ఛీలత పత్రం వచ్చిందని పేర్కొంటున్నారని అఫిడవిట్లో ఆరోపించారు రాహుల్.
ఇదీ చూడండీ: దిల్లీలో 6 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు