ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలకు ఎలాంటి సాయం చేయని వారు.. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బిహార్గంజ్లో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాహుల్. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవటంపై ఇరువురు నేతలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు.
" గతంలో యువతకు ఉద్యోగాలు కల్పించి బిహార్ రూపురేఖలు మార్చుతానని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. కానీ, అది చేయలేకపోయారు. ప్రస్తుతం ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో యువత ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. ప్రశ్నిస్తున్న యువతను బెదిరించటం, దాడులు చేయటం వంటివి చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పేదలు, వలస కార్మికులకు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ఎలాంటి సాయం చేయలేదు. దానికి బదులు లాఠీఛార్జ్ చేయించారు. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో కొత్త మధ్యవర్తులకు మార్గం సుగమం చేశారని ఆరోపించారు రాహుల్. అంబానీ, అదానీ వంటి బడా వ్యాపారులకే మేలు చేకూరేలా చేశారని దుయ్యబట్టారు. 2006లో బిహార్‌లో మండీలను ధ్వంసం చేసిన మాదిరిగానే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. వ్యవసాయ చట్టాల వల్లే కూరగాయలు, ఇతర ఆహారపదార్థాల ధరలు ఆకాశానంటుతున్నాయని ఆరోపించారు.
మోదీ ఓటింగ్ మిషన్‌తో భయపడను: రాహుల్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మోదీ ఓటింగ్ మిషన్ (ఎంవీఎం)గా అభివర్ణించారు రాహుల్ గాంధీ. ఎంవీఎంలు లేదా మోదీ మీడియాకు తాను భయపడనని పేర్కొన్నారు. అది ఈవీఎం అయినా ఎంవీఎం అయినా మహాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'నిజం నిజమే, న్యాయం న్యాయమే. మోదీ భావజాలం, ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కచ్చితంగా వారి ఆలోచనలను ఓడిస్తాం.' అని పేర్కొన్నారు. పలు సమావేశాల్లో తనగురించి మోదీ అసహ్యకరమైన విషయాలు చెప్పారని, ద్వేషాన్ని వ్యాప్తి చేసినప్పటికీ తాను మాత్రం ప్రేమనే పంచానని తెలిపారు. ద్వేషం ద్వేషాన్ని ఓడించదని, ప్రేమ మాత్రమే అది చేస్తుందని చెప్పారు.
-
EVM is not EVM, but MVM - Modi Voting Machine. But, this time in Bihar, the youth is angry. So be it EVM or MVM, 'Gathbandhan' will win: Congress leader Rahul Gandhi in Bihar’s Araria#BiharElections2020 pic.twitter.com/PBSQwfPY0l
— ANI (@ANI) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">EVM is not EVM, but MVM - Modi Voting Machine. But, this time in Bihar, the youth is angry. So be it EVM or MVM, 'Gathbandhan' will win: Congress leader Rahul Gandhi in Bihar’s Araria#BiharElections2020 pic.twitter.com/PBSQwfPY0l
— ANI (@ANI) November 4, 2020EVM is not EVM, but MVM - Modi Voting Machine. But, this time in Bihar, the youth is angry. So be it EVM or MVM, 'Gathbandhan' will win: Congress leader Rahul Gandhi in Bihar’s Araria#BiharElections2020 pic.twitter.com/PBSQwfPY0l
— ANI (@ANI) November 4, 2020
ఇదీ చూడండి: 'వారికి ఓటు వేయడమే బిహార్ చేసిన తప్పు'