ETV Bharat / bharat

'మోదీ అసమర్ధత వల్లే కరోనా కేసుల్లో రెండో స్థానం' - కరోనా కేసుల్లో భారత్​ రెండో స్థానం

కరోనా కేసుల్లో భారత్​ రెండో స్థానంలో నిలవటానికి మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Rahul Gandhi accuses Modi government of 'mismanagement' of COVID situation
'మోదీ అసమర్ధత వల్లే కరోనా కేసుల్లో రెండో స్థానం'
author img

By

Published : Sep 8, 2020, 10:47 PM IST

కరోనా మహమ్మారి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. అందువల్లే ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాల్లో బ్రెజిల్​ను వెనక్కి నెట్టి భారత్ రెండోస్థానానికి చేరిందని ట్వీట్​ చేశారు.

  • Due to Modi Govt’s gross mismanagement of Covid:

    1. India’s total cases world’s 2nd highest.

    2. India’s weekend tally higher than US & Brazil put together.

    3. On Sunday, India's share was 40% of total cases worldwide.

    4. No flattening of curve.

    Stay safe everyone.

    — Rahul Gandhi (@RahulGandhi) September 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కరోనా నియంత్రణలో లోపం వల్ల కొవిడ్​ కేసుల్లో భారత్​ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. గత వారాంతంలో అమెరికా, బ్రెజిల్​ కంటే దేశంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో భారత్ వాటా 40 శాతం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."

---రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

భారత్​లో సోమవారం 75 వేల 809 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 1133 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షల 80 వేల 423కి చేరింది. ఇప్పటివరకు 72 వేల 775 మంది కొవిడ్​కు బలయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.