దేశంలో జరుగుతున్న అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు రాహుల్ గాంధీ. 15 నిమిషాలు చర్చలో పాల్గొంటే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు వేరవుతాయన్నారు. నిజానిజాలు తేలితే.. మోదీ దేశానికి ముఖం చూపించుకోలేరని వ్యాఖ్యానించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ప్రచార కార్యక్రమలో పాల్గొన్న రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
" నరేంద్ర మోదీకి నేను సవాల్ చేస్తున్నా. అవినీతిపై నేను 15 నిమిషాలు చర్చిస్తాను. అవినీతిపై బహిరంగ చర్చలో ఒక వైపు నేను.. మరో వైపు నరేంద్ర మోదీ చర్చిద్దాం. 15 నిమిషాలు చర్చించిన అనంతరం నరేంద్ర మోదీ దేశానికి తన మూఖాన్ని చూపించలేరు. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు వేరవుతాయి. నరేంద్ర మోదీ రండి.. సవాల్‌ను స్వీకరించండి. అవినీతిపై మాట్లాడండి. మోదీ భయాన్ని వీడండి." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు