ETV Bharat / bharat

'రాహుల్ వ్యక్తిగత హాజరు అవసరం లేదు' - supreme court

కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. విచారణకు వ్యక్తిగత హాజరు అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు 'చౌకీదార్​ చోర్​ హై' నినాదాన్ని ప్రచారంలో కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీ
author img

By

Published : Apr 23, 2019, 8:34 PM IST

Updated : Apr 23, 2019, 10:47 PM IST

రాహుల్​కు స్వల్ప ఊరట

కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. విచారణకు హాజరు కానక్కర్లేదంటూ సుప్రీంకోర్టు తాజా తాఖీదుల్లో పేర్కొంది.

ఈ పిటిషన్​పై ఏప్రిల్​ 30న విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

నినాదాన్ని కొనసాగిస్తాం: కాంగ్రెస్

'చౌకీదార్​ చోర్​ హై' వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఉద్దేశపూర్వకంగా ఆపాదించలేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అయితే నినాదాన్ని భవిష్యత్తులోనూ ప్రచారంలో వాడతామని స్పష్టం చేసింది.

రఫేల్​పై తీర్పులో 'చౌకీదార్​ చోర్​ హై' అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయమై సుప్రీం తీర్పును వక్రీకరించి ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా నేత మీనాక్షి లేఖి ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: రాహుల్​ 'దేశద్రోహం' కేసుపై 26న విచారణ

Ahmedabad (Gujarat), Apr 23 (ANI): Union Finance Minister Arun Jaitley on Tuesday reached Gujarat's Ahmedabad to cast his vote. Following all the necessary procedures, Jaitley cast his vote and also allowed some youngsters to take selfie with him. Poling for the third phase of the General election is underway across 116 Lok Sabha constituencies in the country. Gujarat is one of the states, which is voting for a total of 26 seats today, with 371 candidates in the fray.
Last Updated : Apr 23, 2019, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.