ETV Bharat / bharat

రాహుల్​ X భాజపా: పుల్వామాపై రాజకీయ రగడ

పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది అవుతున్న సందర్భంగా అధికార భాజపాపై విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. ఈ దాడి వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందంటూ ట్విట్టర్​ వేదికగా ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు. ఈ ఆరోపణలను భాజపా తీవ్రంగా ఖండించింది. అమరుల త్యాగాలతో రాజకీయాలేంటని మండిపడింది. తాము అడిగే రెండు ప్రశ్నలకూ రాహల్ సమాధానం చెప్పాలని దిల్లీ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ సవాల్ విసిరారు.

rahul latest news
రాహుల్​ X భాజపా: పుల్వామాపై రాజకీయ రగడ
author img

By

Published : Feb 14, 2020, 5:12 PM IST

Updated : Mar 1, 2020, 8:28 AM IST

2019లో ఇదే రోజున పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఏడాది తర్వాత ఈ ఘటనపై భాజపా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. పుల్వామా ఘటనతో ఎవరికి ప్రయోజనం చేకూరిందని ట్విట్టర్​ వేదికగా కేంద్రానికి మూడు ప్రశ్నలు సందించారు.

"పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్‌ అమర జవాన్లను మనం ఈ రోజు స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా కేంద్రాన్ని మనం అడగాల్సినవి ఇవే.. 1. ఈ దాడితో ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది? 2. దాడిపై చేపట్టిన దర్యాప్తులో ఏం తేలింది? 3. దాడికి కారణమైన భద్రతా లోపాలకు భాజపా ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తున్నారు?"

-రాహుల్​ గాంధీ ట్వీట్​.

రాహుల్​ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలతో రాజకీయాలేంటని మండిపడింది.

"రాహుల్​ వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇలాంటి భాష మాట్లాడే రాజకీయ నాయకులను ప్రజలు రాబందులంటారు. అమరుల త్యాగాలనూ రాజకీయం చేస్తున్నారు. దేశంకోసం ప్రాణాలర్పించిన వారి వల్ల దేశానికే ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తే.. మా వద్దా రెండు ప్రశ్నలున్నాయి. ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ హత్యల వల్ల ఎవరు ప్రయోజనం పొందారో చెప్పాలి. ఇలాంటి వ్యాఖలు చేసే వ్యక్తులు ఉండటం మన దౌర్భాగ్యం.

-మీనాక్షీ లేఖి, దిల్లీ భాజపా ఎంపీ.

పాకిస్థానీ భాష...

రాహుల్ వ్యాఖ్యలపై భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్​ ఉగ్రవాద సంస్థలకు వత్తాసు పలికేలా రాహుల్​ భాష ఉందని ట్వీట్​ చేశారు. పుల్వామా దాడికి బాధ్యులైన పాకిస్థాన్​ను ఆయన ఎప్పుడూ ప్రశ్నించరని ఆరోపించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో పాక్ సైన్యం కాల్పులు.. స్థానికుడు మృతి

Last Updated : Mar 1, 2020, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.