కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ప్రభుత్వం వైఖరిని తప్పుబడుతూ.. భారత్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్వీట్ చేశారు.
"చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం చంబెర్లిన్(రాజ భవనంలో గృహ బాధ్యతలు నిర్వహించే అధికారి)లా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ వైఖరితో భారత్ భారీ మూల్యం చెల్లించక తప్పదు."
--- రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నేత.
లద్ధాఖ్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకు సంబంధించిన వార్తను తన ట్వీట్‌కు జత చేశారు గాంధీ.
గత కొంత కాలంగా చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరు దేశాల అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ పూర్తి వ్యవహారంలో భారత ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్ గాంధీ అనేక మార్లు విమర్శించారు.
ఇవీ చూడండి:-