పేద ప్రజల ప్రాథమిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం లాగేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాహుల్.. ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"పేద ప్రజల ప్రాథమిక హక్కులను నరేంద్రమోదీ ప్రభుత్వం లాగివేస్తోంది. ఇది మానవత్వం పట్ల నేరం వంటిది. దేశ ఉత్తమమైన భవిష్యత్తు దృష్ట్యా ప్రతీ వర్గం హక్కులను కూడా గౌరవించాలి"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
లాక్డౌన్లో పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఉన్న ఓ మీడియా కథనాన్ని రాహుల్ తన ట్వీట్‌కు జతచేశారు.
ఇదీ చూడండి:జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి