యూపీఏ హయాంలో జరిగిన లక్షిత దాడులు వీడియోగేమ్‌లు అయి ఉండవచ్చన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
సైన్యం దేశం మొత్తానికి చెందిందని... ఏ ఒక్కరికో పరిమితం కాదని అన్నారు. మోదీ జాతీయవాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవడం పట్ల పరోక్ష విమర్శలు చేశారు. సైన్యంతో రాజకీయాలు చేయడం తమ విధానం కాదన్నారు రాహుల్. ప్రస్తుతం ప్రతిపక్షాల్ని ఎదుర్కోలేని బలహీన ప్రధానిని చూస్తున్నామన్నారు.
"సైన్యం మోదీ వ్యక్తిగత ఆస్తి కాదు. ప్రధాని త్రివిధ దళాలను ఆయన వ్యక్తిగత ఆస్తిగా భావిస్తున్నారు. యూపీఏ పాలనలో జరిగిన లక్షిత దాడులు వీడియో గేమ్‌లని అనటం అంటే.. మోదీ సైన్యాన్ని అవమానించినట్టే. కాంగ్రెస్‌ను అవమానించినట్టు కాదు. లక్షిత దాడులు సైన్యం చేసింది. సైన్యం భారతదేశానికి చెందింది. ఏ ఒక్కరి సొత్తో కాదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఇవీ చూడండి: భాజపా ఓటమి తథ్యం: రాహుల్ గాంధీ