బిహార్ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ విపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ ఆర్జేడీకి రాజీనామా చేశారు.
పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు. లాలూ ప్రసాద్‌కు రాసిన ఏక వాక్య రాజీనామా లేఖలో రఘువంశ్ 32 ఏళ్లుగా ఆయన వెంట ఉంటున్న తాను ప్రస్తుతం మాత్రం ఉండడం లేదని వివరించారు. తాను ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల ప్రేమను పొందానన్న రఘువంశ్ తనను క్షమించాలని లాలూను కోరారు.
ఇవీ చూడండి:-