రాహుల్ వయనాడ్ లోక్సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారని తెలిసినా... పార్టీ నేతలు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూశారు. రాహుల్ అమేఠీతో పాటు వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగానే... సంబరాలు మొదలెట్టారు. రాహుల్ ఫోటోలు, పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ వయనాడ్ వీధులన్నీ చుట్టేశారు పార్టీ కార్యకర్తలు.
వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి 'ఎం.ఐ షానవాస్' గతంలో రెండుసార్లు(2009,2014) విజయం సాధించారు. గతేడాది నవంబర్లో ఆయన మరణించారు.
వయనాడ్ లోక్సభ అభ్యర్థిగా రీరీ సునీర్ను ప్రకటించింది వామపక్ష కూటమి. భాజపా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.