తమిళనాడు ధర్మపురిలోని కుడిమియంపట్టి గ్రామంలో కుందేళ్ల పండుగ అట్టహాసంగా జరిగింది. కుందేళ్లను పట్టుకునేందుకు నిర్వహించే ఈ పండుగలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.
కుందేళ్ల పండుగను సంక్రాంతి తర్వాతి రోజున నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయ వేడుకలో భాగంగా మర్రియమ్మన్, వెడ్డియప్పన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయం ముందున్న వందేళ్లనాటి మర్రి చెట్టు వద్ద కుందేళ్లకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం వాటిని అడవిలోకి వదులుతారు. కుందేళ్లను తిరిగి తీసుకురావడానికి యువకులు అడవుల్లోకి వెళ్తారు.
ఈ పండుగలో అడవికి వెళ్లి కుందేళ్లను పట్టుకురావటం యువకులు ఓ సవాల్‌గా భావిస్తారు. అడవిలోకి వెళ్లిన కుందేళ్లను పట్టుకున్న యువకులను వీరులుగా చూస్తారు గ్రామస్థులు.