లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం బాట పట్టింది. ఈ నేపథ్యంలో మూడో లాక్డౌన్ విధింపు సమయంలో పలు సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీంతో పలు పరిశ్రమలు, వ్యాపారాల ప్రారంభంతో పాటు మద్యం దుకాణాలకూ తలుపులు తెరిచారు. మహారాష్ట్రలోనూ వైన్ షాపులు తెరిచేందుకు అనుమతులు వచ్చాయి. ఈ తీపికబురు విన్న మద్యపాన ప్రియులు దుకాణాల ముందు బారులు తీరారు. క్యూలో నిల్చుని మందు బాటిల్ కొనుగోలు చేసేందుకు మరీ ఎక్కువ సమయం పడుతోందని భావించిన మందుబాబులు మరో ఉపాయం ఆలోచించారు. తమ భార్యలను వైన్ షాపులకు పంపి మద్యం తెప్పించుకుంటున్నారు.
అసలు కథ ఇదీ..
'లేడీస్ ఫస్ట్' అనే సంప్రదాయం ప్రకారం భీవండిలోని అంబాడి వద్ద మద్యం దుకాణాల ముందు మహిళలు బారులుతీరి మద్యం కొనడం కనిపించింది. 'మీరు సేవించేందుకే మద్యం కొంటున్నారా' అని ఆరా తీయగా అసలు విషయం చెప్పారు ఆ అతివలు. చాలామంది మహిళలు తమ భర్తల కోసం కొంటున్నామని చెప్పారు. మరికొద్ది మంది మాత్రం.. లిక్కర్ కొనమని మందుబాబులు తమను కోరినందుకే ఇలా వరుసల్లో నిలబడినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'మెరుపు దాడి 3.0' భయాలతో పాక్ గజగజ