కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ నోట్ల ముద్రణపై పడింది. భారత సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్పీ) కరెన్సీ నోట్ ప్రెస్-సీఎన్పీ)ల్లో అన్ని కార్యకలాపాలను ఈ నెలాఖరు వరకు నిలిపేశారు. ఈ మేరకు నాసిక్‌లోని భారత సెక్యూరిటీ అండ్ మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. అయితే ఈ రెండు యూనిట్లలో అగ్నిమాపక సిబ్బంది, భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపింది.
1950 తర్వాత మళ్లీ ఇఫ్పుడే
గతంలో ఐఎస్పీ కార్మికుల నిరసనలతో 1950లో ఒక నెల పాటు ప్రెస్ మూతపడింది. 1979లోనూ కార్మికుల నిరసనల వల్ల ఐఎస్పీ, సీఎన్పీలు నెలరోజుల పాటు మూతపడ్డాయి.