ETV Bharat / bharat

విస్తరిస్తోన్న వైరస్​.. లాక్​డౌన్​లో పందులు!

ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసిన నిన్న మొన్నటి వరకు లాక్​డౌన్​ మాటే వినిపించింది. వైరస్ ​తగ్గుముఖం పట్టిన దేశాల్లో కొన్ని సడలింపులతో లాక్​డౌన్ ఎత్తివేశారు. అయితే ఇప్పుడు లాక్​డౌన్​లోకి వెళ్లడం పందుల వంతైంది. పందులకు లాక్​డౌన్​ ఏంటి? అని అనుకుంటున్నారా? ఎక్కడో కాదు దేశంలోని ఓ ఈశాన్య రాష్ట్రంలో పందులకు లాక్​డౌన్​ విధించారు. ఎందుకో తెలుసా?

Pygmy hogs - the world's smallest and rarest wild pig - are under a virus lockdown.
విస్తరిస్తోన్న వైరస్​.. లాక్​డౌన్​లో పందులు!
author img

By

Published : Aug 10, 2020, 6:13 PM IST

Updated : Aug 11, 2020, 6:15 AM IST

విస్తరిస్తోన్న వైరస్​.. లాక్​డౌన్​లో పందులు!

అసోంలోని అరుదైన మరగుజ్జు పందుల(పిగ్మీ హగ్స్​)పై లాక్​డౌన్​ విధించారు. ఎందుకో తెలుసా? పందుల్లో అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల్లో ఒకటైన 'ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ' విస్తరింస్తుండటమే ఇందుకు కారణం.

ఈ పందులు 1960లోనే అంతరించిపోయాయని భావించారు. అయితే నిర్బంధ సంతానోత్పత్తి కార్యక్రమం, ఇతర పరిరక్షణ చర్యల ద్వారా వీటిని కాపాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ తీవ్రంగా విస్తరిస్తోంది. దీంతో వ్యాధి బారినపడి పెద్ద సంఖ్యలో పందులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పందులకు లాక్​డౌన్​ విధించి.. వాటి కోసం ఏర్పాటు చేసిన షెడ్​ల్లోనే నిర్బంధించారు. ప్రస్తుతం అసోంలోని గువాహటి, నమేరి ప్రాంతాల్లోని సంతానోత్పత్తి కేంద్రాల్లో 82 పందులు, పంది పిల్లలు నివసిస్తున్నాయి.

ఎలా వ్యాపిస్తోంది?

'పందుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా, కలుషిత ఆహార పదార్థాలు తినడం వల్ల వైరస్​ వ్యాపిస్తోంది. ఫలితంగా రక్తంలో అధిక స్థాయిలో వైరస్​ ఉండటం వల్ల పందులు చనిపోతున్నాయి. మాంసంతోనూ ఈ వైరస్ విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా ఇతర జంతువులకూ వైరస్​ సులభంగా సోకే అవకాశం ఉంది' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా నిబంధనలే దీనికి వర్తిస్తాయి!

ఈ ఏడాది మే 18 నుంచి దేశంలో ఈ వైరస్ వ్యాపిస్తోందని అధికారులు ధ్రువీకరించారు. అనంతరం నిర్బంధ సంతానోత్పత్తి కేంద్రాలను మూసివేసి... కఠినమైన జాగ్రత్తలు పాటిస్తున్నట్లు పిగ్మీ హగ్​​ కన్జర్వేషన్​​ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్న పరాగ్​​ డెకా చెప్పారు.

కరోనా కట్టడికి ఎటువంటి చర్యలు చేపట్టారో.. అదే రకమైన నిబంధనలు వీటికి కూడా అమలు చేశారు అధికారులు. పందులను పర్యవేక్షించే సిబ్బంది బయటకు వెళ్లి వస్తే.. కాళ్లు, చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటున్నారు.

దీర్ఘకాలం జీవించగలదు!

ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ శక్తిమంతమైందని.. దీర్ఘకాలం జీవించగలదని చెబుతున్నారు పరిశోధకులు. ప్రస్తుతం దీనికి ఎటువంటి మందు లేదు. ఇంకా వ్యాక్సిన్​పై పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవానికి వ్యాక్సిన్​ వచ్చేందుకు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని బ్రిటన్​ పరిశోధకులు తెలిపారు. దీంతో పాటు కరోనా సంక్షోభం వల్ల నిర్వహణ కూడా కష్టంగా మారింది. నిధుల కొరత వల్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్వాహకులు.

ఇదీ చూడండి: భారత్​లో ఆఫ్రికన్​ స్వైన్‌ ఫ్లూ విజృంభణ

Last Updated : Aug 11, 2020, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.